TG : డ్రంకెన్ డ్రైవ్ లో హల్చల్.. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీపై పోలీసుల చర్యలు
హైదరాబాద్ మధురానగర్‌లో డ్రంకెన్ డ్రైవ్ సందర్భంలో హల్‌చల్ చేసిన సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీపై డిపార్టుమెంటల్ ఎంక్వయిరీ షురూ చేసినట్టు పోలీసులు తెలిపారు. రిపోర్ట్ అందిన తర్వాత ఏసీపీపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. మూడు రోజుల క్రితం మధురా నగర్‌లో మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయకుండా రోడ్డుపై హల్‌చల్ చేశారు ఏసీపీ సుమన్ కుమార్.. ఏసీపీ సుమన్ కుమార్‌తోపాటు మరో ఇద్దరిపై మధురానగర్ పోలీసులకు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ ఫిర్యాదు చేశారు. ఏసీపీ సుమన్ కుమార్ హల్‌చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏసీపీపై విచారణకు ఆదేశించడం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఏసీపీ అనవసరంగా ఇష్యూ చేసుకున్నాడని సోషల్ మీడియాలో జనం కామెంట్లు పెడుతున్నారు.