TG : బెట్టింగ్ యాప్స్ కేసులపై సిట్.. 90 రోజుల్లో రానున్న నివేదిక

Update: 2025-04-01 11:30 GMT

రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్యాప్స్ కేసుల దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేశారు. ఈమేరకు సోమవారం డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ బృందంలో ఐజీ రమేష్, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్లను సభ్యులుగా చేర్చారు. హైదరాబాద్ కమిషరేట్ పరిధిలోని పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ లో 25 మంది టాలీ వుడ్, బాలీవుడ్, యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను సిట్ కు బదిలీ చేస్తూ 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీ ఆదేశించారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పించిన ఇన్ఫ్లూయెన్సర్లను సిట్ విచారించనుంది.

నెట్ వర్కులపై సిట్ నిఘా పెట్టనుంది.

బెట్టింగ్ యాప్స్ నెట్ వర్క్ సూత్రధారులను బయటకు రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నించనున్నారు. విచారణలో భాగంగా సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై నమోదైన కేసులను పరిశీలించనున్నారు. యాప్లను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. న్యాయ నిపుణుల సలహాతో దర్యాప్తు వేగవంతం చేయనున్నారు.

Tags:    

Similar News