తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉంది : సోమేష్ కుమార్
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో దేనికీ కొరత లేదని చెప్పారు.;
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో దేనికీ కొరత లేదని చెప్పారు. . ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. ఆక్సిజన్ బెడ్స్ ఇంకా పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. కరోనా నియంత్రణలో ఖర్చుకు వెనుకాడొద్దని సీఎం చెప్పినట్టు తెలిపారు. తెలంగాణలో 135 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ నింపుకొని రావడానికి 6 రోజులు పడుతోందని ...ఎయిర్‌లిఫ్ట్ చేయడం ద్వారా 3 రోజుల సమయం ఆదా అవుతోందని చెప్పారు సీఎస్ సోమేష్ కుమార్.