జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న ఆరుగురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం బాలికలు అస్వస్థతకు గురైన సంగతి సిబ్బంది దృష్టికి వచ్చిన వెంటనే వారిని అంబులెన్స్ లో జగిత్యాల మాతాశిశు కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. చలి కారణంగా శ్వాస సంబంధిత సమస్యతో బాలికలు ఇబ్బందులు పడ్డారని తెలిసింది. ఈ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. విద్యార్థినులను హాస్పిటల్ లో గులాబీ నేతలు పరామర్శించారు.