SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ లో పరిస్థితి దారుణం.. ఆక్సిజన్ అందట్లే!

Update: 2025-02-26 12:15 GMT

SLBC సొరంగంలో పరిస్థితిని తట్టుకోలేక సహాయక బృందాలు వెనుతిరిగాయి. రాత్రి 7.30 గంటలకు మరో పది మీటర్ల దూరం వెళ్తే ప్రమాదస్థలికి చేరుతామని, కానీ అక్కడ ఊపిరి అందటం లేదని, అదేవిధంగా ఊట కారుతోందని మెయిల్ ఇంజనీరింగ్ దళ సభ్యుడు తెలిపాడు. వెలుతురు లేదు, ప్రాణవాయువు అందటం లేదు. పైగా మరో అడుగువేస్తే ప్రమాదం తప్పదని అందరూ తిరిగి వచ్చినట్టు చెప్పాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లు, మెయిల్ ఇంజనీరింగ్ సభ్యులు మొత్తం 64 మంది సొరంగంలోకి వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు బయటకు వచ్చారు. అక్కడ పరిస్థితి విషమం కావటంతో తట్టుకోలేక వారు వెనుదిరిగారు. గురువారం ఉదయం ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్తామని వివరించారు.

Tags:    

Similar News