నగరంలోని కోకాపేటలో విషాదం చోటుచేసుకున్నది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్.. కోకాపేటలో హాస్టల్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత రాత్రి హాస్టల్ గదికి వచ్చిన ఆయన భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రభాకర్ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది.