Gaddam Prasad Kumar : అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ.. రాజకీయవర్గాల్లో ఉత్కంఠ

Update: 2025-09-29 11:15 GMT

తెలంగాణలో రాజకీయాంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం విచారణ చేపట్టనున్నారు. విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు.. కాలె యాదయ్య, మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ విచారణలో ప్రతివాదుల తరపు న్యాయవాదులు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అలాగే ఈ పిటిషన్లకు సంబంధించి సంజయ్, చింతా ప్రభాకర్లను కూడా ప్రతివాదుల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.

అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు ఈ విచారణ నేపథ్యంలో ఈరోజు నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణ ఫలితంపై రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News