TG : కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు

Update: 2024-10-30 14:30 GMT

పేదల తిరుపతిగా, కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్న కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోలలోని 9 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.శ్రీదేవి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ నెల 31 నుంచి నవంబర్ 18 వరకు జరిగే జాతరకు మూడు రోజులు మొత్తం 179 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆమె తెలిపారు. ప్రధానంగా నవంబర్ 7 న 38 బస్సులు,8 వ తేదీ ఉద్దాల ఉత్సవం సందర్భంగా 103 బస్సులు,9 వ తేదీన 38 ప్రత్యేక బస్సులు అవిశ్రాంతంగా నడుస్తాయని ఆమె తెలిపారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రత్యేక బస్సులు నడిపిస్తామని,భక్తులు సురక్షిత ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News