SpiceJet: హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి ఎయిర్ లైన్స్ సర్వీసులు ప్రారంభం..
SpiceJet: స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ సర్వీస్‌ను ప్రారంభించింది.;
SpiceJet: హైదరాబాద్-పాండిచ్చేరి మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.. స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ సర్వీస్‌ను ప్రారంభించింది.. తొలి ఫ్లైట్‌లో గవర్నర్ తమిళి సై హైదరాబాద్ వచ్చారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్ మీడియాతో మాట్లాడారు.. పాండిచ్చేరికి డైరెక్ట్ సర్వీసులు ప్రారంభించడం పట్ల ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.. నేరుగా విమాన సర్వీసులతో పర్యాటక రంగంతోపాటు పారిశ్రామిక రంగం అభివృద్ది చెందుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.