TS : విత్తనాలపై విషప్రచారం చేస్తే అరెస్ట్ చేస్తాం.. కలెక్టర్ హరిచందన వార్నింగ్
నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మీడియా సమావేశంలో సోషల్ మీడియా ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో విత్తనాల కొరత లేదని చెప్పారు. కొందరు విత్తనాల కొరత ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు.
అపోహలను రైతులెవరూ నమ్మొద్దనీ.. దళారుల దగ్గర విత్తనాలు కొని రైతులెవరూ మోసపోవద్దని చెప్పారు కలెక్టర్..దళారీ విధానం,నకిలీ విత్తనాలను అరికట్టడానికి జాయింట్ టీమ్ ఏర్పాటు చేశామని.. టీమ్ లో పోలీస్, రెవిన్యూ,వ్యవసాయ శాఖ అధికారులు భాగస్వాములుగా ఉన్నారన్నారు.
రైతులకు ఏమైనా సమస్యలున్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా హెల్ప్ లైన్ నెంబర్ 72888 44023 కి కాల్ చేయాలని తెలిపారు కలెక్టర్.