ఉగ్రదాడికి నిరసనగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ స్తోత్రం పారాయణ చేశారు. పహల్గాంలో హిందువులను టార్గెట్గా చేసి చంపడాన్ని నిరసిస్తూ.. ఆలయ వైదిక సిబ్బంది శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం నిర్వహించారు. ఉగ్రవాదం పూర్తిగా నశించి మన భారత దేశం సుభిక్షంగా ఉండాలని.. ప్రపంచ దేశాల్లో ఉన్న మన హిందువులు క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ పారాయణం చేశారు. పరిపాలనా సిబ్బంది, పదవీ విరమణ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.