సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుంది. ఘటన జరిగి 56 రోజులు గడుస్తున్నా శ్రీతేజ్ ఇంకా కోలుకోలుదు. మంచంపైనే శ్రీతేజ్ కు వైద్యం అందిస్తున్నారు. 56 రోజులుగా ఇప్పటికీ శ్రీతేజ కళ్లు కూడా తెరవలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. పైప్ సహాయంతోనే శ్రీతేజ్ కు ఆహారం అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు మేరుగుపడుతుందో చెప్పలేమంటున్నారు కిమ్స్ వైద్యులు. మెరుగైన వైద్యం కోసం విదేశాల నుంచి ఎక్విప్ మెంట్ తెచ్చే ఏర్పాట్లలో ఉన్నారు.