గుప్త నిధుల తవ్వకం : బయటపడ్డ బంగారు వినాయకుడి విగ్రహం
వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల్‌లో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపుతోంది. తవ్వకాల్లో బంగారు వినాయకుడి విగ్రహం బయటపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.;
వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల్‌లో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపుతోంది. తవ్వకాల్లో బంగారు వినాయకుడి విగ్రహం బయటపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వినాయకుడి విగ్రహం చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నారాయణపేట్ జిల్లా పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు పిట్ల మల్లయ్యకు వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల్‌లో పొలం ఉంది. రైతు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి వచ్చి కొందరు పొలంలో తవ్వకాలు జరిపినట్టు తెలుస్తోంది. గుప్త నిధుల వ్యవహారంపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.