317 జీవోపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయడం పట్ల జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సందీప్, మధుసూదన్ రెడ్డి, రాపోలు శేఖర్, చాముండేశ్వరి, వినోద, హారతి తదితరులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధ్వంసం చేసిన స్థానికతను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే పునర్ధించి స్థానికత కోల్పోయిన ప్రతి బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని తెలిపారు. మాట ప్రకారం 317 జీవో సబ్ కమిటీని ఏర్పాటు చేసి త్వరగతిన రిపోర్టు అందించడం శుభ పరిణామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీ రిపోర్ట్ స్థానికత కోల్పోయిన ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయునికి తన స్థానికత తిరిగి ఇస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. సీఎం స్పందించి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.