Janasena in Telangana : జనసేనకు సూపర్ న్యూస్.. తెలంగాణలోనూ పార్టీకి గుర్తింపు

Update: 2025-02-07 09:45 GMT

జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. ఇకపై గాజు గ్లాసు చిహ్నాన్ని ఎవరికీ కేటాయించరు.

గత నెలలోనే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీ కూడా చేరింది.. నిబంధనల ప్రకారం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ కూడా అందింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.

Tags:    

Similar News