జహీరాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాఠశాల వసతి గృహంలో బాలుడి(12) మృతదేహాన్ని గుర్తించారు. అతడి తల, పెదవులు, కనుబొమ్మలపై గాయాలున్నాయి. హాస్టల్‌లోని మంచంపై నుంచి పడి మృతి చెందాడని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనల్లో విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి.