తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్రాథమిక కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రారంభించింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాను సిద్ధం చేయడం, ప్రిపరేషన్, ఇతర ఏర్పాట్లపై ఆగస్టు 2, 3 తేదీల్లో జిల్లాల వారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచరీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు ఒక్కో జిల్లా నుంచి ఐదుగురు ఆపరేటర్ల పేర్లతో జాబితాను ఈనెల 31వ తేదీ లో పు మెయిల్ ద్వారా పంపాలని కలెక్టర్లకు సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్య దర్శి ఎం.అశోక్ కుమార్ సర్క్యులర్ జారీ చేశారు.
కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.