T-Hub 2.0: దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ హబ్‌-2 ప్రారంభం..

T-Hub 2.0: హైదరాబాద్‌ను స్టార్టప్‌ క్యాపిటల్‌గా నిర్మించటమే ..తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్‌.;

Update: 2022-06-28 13:50 GMT

T-Hub 2.0: హైదరాబాద్‌ను స్టార్టప్‌ క్యాపిటల్‌గా నిర్మించటమే ..తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్‌. యువ వ్యాపార వేత్తలను తయారు చేయడమే టీ హబ్ ధ్యేయమన్న సీఎం కేసీఆర్‌...యువతకు టీ హబ్ మార్గద్శకంగా ఉండ బోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం.. దేశంలో స్టార్ట్ అప్ ఆఫ్ స్టేట్‌గా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.

హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ హబ్‌-2 ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గ్రాండ్‌గా జరిగిన టీ హబ్‌-2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీహబ్‌ సీఈవో శ్రీనివాస్‌రావు, సైయింట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లకు వసతి కల్పించేలా 400 కోట్లతో టీ హబ్‌-2 ను నిర్మించారు. టీ హబ్‌-2 ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణంగా రికార్డ్‌కెక్కింది.

Tags:    

Similar News