Khairatabad Ganesh 2022: ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలిపూజ చేసిన గవర్నర్‌ తమిళిసై..

Khairatabad Ganesh 2022: ఖైరతాబాద్‌ మహాగణపతిని గవర్నర్‌ తమిళిసై దర్శించుకుని.. తొలిపూజ చేశారు.;

Update: 2022-08-31 06:45 GMT

Khairatabad Ganesh 2022: ఖైరతాబాద్‌ మహాగణపతిని గవర్నర్‌ తమిళిసై దర్శించుకుని.. తొలిపూజ చేశారు. ఆమెతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకున్నారు. తొలిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్‌ తమిళిసై. కరోనాతో రెండేళ్లుగా ఖైరతాబాద్‌కు ప్రజలు రాలేకపోయారని.. అందరూ సంతోషంగా ఉండేలా విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు.

హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకున్నారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఖైరతాబాద్‌లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 50 అడుగుల ఎత్తులో కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. భక్తులు భారీగా తరలివస్తుండటంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News