Tamilisai Soundararajan: 'సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చు..'

Tamilisai Soundararajan: కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చంటూ తమిళిసై మీడియాతో ఆఫ్‌ ది రికార్డ్‌గా మాట్లాడారు.

Update: 2022-07-25 08:30 GMT

Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చంటూ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మీడియాతో ఆఫ్‌ ది రికార్డ్‌గా మాట్లాడారు. మారిన రాజకీయ పరిస్థితులే అందుకు కారణం కావొచ్చని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు కాబట్టే.. ప్రధానిమోదీని టార్గెట్ చేస్తూ ఉండొచ్చని కామెంట్ చేశారు. మోదీని టార్గెట్ చేయడం వల్ల కేసీఆర్ లబ్ధిపొందుతారని తాను అనుకోవడం లేదని అన్నారు తమిళిసై.

తెలంగాణకు కేంద్రం ఎన్నో రకాలుగా సాయం చేస్తోందని, రోడ్లు, రేషన్, వ్యాక్సిన్ సహా రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం అందుతోందన్నారు. విభజన హామీలపై ఇప్పటికే చాలా వరకు నెరవేరాయని, సమయానుకూలంగా అన్ని పరిష్కారం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కావాలనే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు తమిళిసై.

ప్రగతి భవన్, రాజభవన్ మధ్య గ్యాప్ ఉందన్నది బహిరంగ రహస్యమేనని, ప్రజలు బాధల్లో ఉన్నందునే వరద ప్రాంతాల్లో పర్యటించానన్నారు తమిళిసై. వరద ప్రాంతాల్లో తన దృష్టికి వచ్చిన అంశాలను ప్రభుత్వానికి చెప్పానని, ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. వర్షాలు, భారీ వరదలు యానాంలో కూడా వచ్చాయని, తనకు తెలిసినంత వరకు క్లౌడ్ బరస్ట్ అనేది సాంకేతికంగా సాధ్యమయ్యేది కాదని కామెంట్ చేశారు.

Tags:    

Similar News