Bhadradri Kothagudem: లెక్చరర్ అమానుషం.. కోపంలో విద్యార్థి తలను గోడకేసి కొట్టి..
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లెక్చరర్ దురుసు ప్రవర్తన విద్యార్థి ప్రాణాలపైకి తెచ్చింది.;
Bhadradri Kothagudem: లెక్చరర్ దురుసు ప్రవర్తన విద్యార్థి ప్రాణాలపైకి తెచ్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. డ్రెస్సింగ్ సరిగాలేదంటూ ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థి కార్తీక్‌పై ఫిజిక్స్ లెక్చరర్ రాంబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా విద్యార్థి తలను గోడకేసి కొట్టాడు. దీంతో విద్యార్థి పరిస్థితి విషమించడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్ తెలిపారు. దురుసుగా ప్రవర్తించిన లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి డిమాండ్ చేసింది.