వరద బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముందుకు వచ్చారు. ఎమ్మెల్సీగా ఆయన నెల జీతం రూ. 2,75,000 ను సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్ ) కు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి చెక్కును పంపించారు.
ఈ సందర్భగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని, ప్రస్తుతం ఈ మూడు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అయ్యాయని, తనను గెలిపించిన ప్రజలు ఇబ్బందుల్లో పడడం తనను కలిచి వేసిందని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అందుకే తన వంతుగా నెలజీతం విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాణిజ్య సంఘాలు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు తీన్మార్ మల్లన్న. బాధితులు అందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.