Teenmaar Mallanna : ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపు

Update: 2024-06-08 05:00 GMT

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) విజయం సాధించారు. రెండు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో మల్లన్నకి బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. చివరి దశలో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్‌తో మల్లన్న, రాకేశ్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి BRS అభ్యర్థి ఎలిమినేషన్‌తో మల్లన్న గెలిచారు.

నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ తొలిసారిగా గెలుచుకున్నది. 2015లో కాంగ్రెస్ మద్దతుతో ఫస్ట్​టైమ్ పోటీ చేసిన మల్లన్నకు చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. మళ్లీ 2021లో రాముల నాయక్​ పోటీ చేసినప్పడు 27, 588 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ బైపోల్​లో సిట్టింగ్​ స్థానాన్ని కాపాడుకునేందుకు కేటీఆర్, హరీశ్ రావు, పల్లా గట్టిగానే ఫైట్ చేశారు మల్లన్న మీద సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. కానీ గ్రాడ్యుయేట్లు మాత్రం అంతిమంగా మల్లన్న వైపే మొగ్గు చూపారు.

Tags:    

Similar News