Tienmaar Mallanna : కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్.. అసలు కారణం ఇదే
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల హన్మకొండలో ఓ సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. కులగణన పేపర్లను చింపడాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది. ఫిబ్రవరి 12న కారణం తెలపాలని ఫిబ్రవరి 5న నోటీసు ఇచ్చినా మల్లన్న రియాక్ట్ కాకపోవడంపై కాంగ్రెస్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆగ్రహం వ్యక్తంచేసింది. తీన్మార్ మల్లన్న చేసిన పార్టీ వ్యతిరేక చర్యలకు ప్రతిస్పందనగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది.
పార్టీ లైన్ దాటితే ఎవరినైనా ఊరుకునేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామని.. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని తెలిపారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పనీ.. పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.