Bandi Sanjay : బీజేపీ అంటే కేసీఆర్‌కు వణుకు మొదలైంది : బండి సంజయ్
Bandi Sanjay : ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్ర జోరుగా సాగుతోంది;
Bandi Sanjay : ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్ర జోరుగా సాగుతోంది. రెండో రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్, ఇందిరమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త CN రెడ్డి గారి ఆధ్వర్యంలో వలిగొండ మండలం ఆరూర్ గ్రామానికి చెందిన సుమారు 1000 మంది కార్యకర్తలు బిజెపిలో చేరారు.
బీజేపీ అంటే కేసీఆర్‌కు వణుకు మొదలైందన్నారు బండి సంజయ్. రెండో రోజు యాత్ర ముగింపు సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ హయాంలో భువనగిరి మున్సిపాలిటీ ఏ మాత్రం అభివృద్ధి కాలేదన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని...డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనన్నారు. బీజేపీ సపోర్ట్‌తోనే తెలంగాణ వచ్చిందన్నారు.
నయీం దగ్గర స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని కక్కిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే కేసీఆర్ గడీలు బద్దలవుతాయన్నారు. ఉప ఎన్నిక వస్తేనే నిధులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు సంజయ్.
అంతకముందు బస్వాపూర్‌లోని భూ నిర్వాసితులతో రచ్చబండ కార్యక్రమం కూడా నిర్వహించారు. టీఆర్‌ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు కదులుతున్నారు. బండి సంజయ్ పాదయాత్ర...గ్రామాల్లోని బీజేపీ క్యాడర్‌లో ఫుల్ జోష్ నింపింది. భూ నిర్వాసితులు... తమ గోడును బండి సంజయ్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఇవాళ భువనగిరి మండలం గొల్లగూడెం నుంచి ప్రారంభం కానున్న యాత్ర...మఖ్ధుంపల్లి, పెద్దపలుగుతండా, చిన్నఅరవెల్పల్లి మీదుగా గుర్రాలదండి వరకు సాగనుంది. గుర్రాలదండిలో సంజయ్ రాత్రి బస చేయనున్నారు.