BJP సింగిల్‌గా వస్తుంది.. MIMకు బండి సవాల్
MIMకు దమ్ముంటే తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయాలని BJP రాష్ట్ర అధ్యక్షుడు సవాల్ విసిరారు;
మజ్లిస్‌పై నిప్పులు చెరిగారు BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంఐఎంకు దమ్ముంటే తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. BRSతో వస్తారో కాంగ్రెస్‌తో కలుస్తారో చూసుకుందాం. బీజేపీ సింగిల్‌గా వస్తుంది డిపాజిట్లు రాకుండా చేస్తుందని చెప్పారు. ఎంఐఎంను ముస్లింలే చీత్కరిస్తున్నారని.. అధికార పార్టీతో అంటకాగుతూ ఆస్తులు కాపాడుకోవడమే ఓవైసీ నైజమని మండిపడ్డారు. ఇన్నేళ్లుగా పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో చెప్పాలన్నారు.