Telangana budget 2022-23 : తెలంగాణ బ‌డ్జెట్ 2022-23 కేటాయింపులు ఇలా.. !

Telangana budget 2022-23 : తెలంగాణ అసెంబ్లీలో 2022-23 బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు.

Update: 2022-03-07 08:15 GMT

Telangana budget 2022-23 : తెలంగాణ అసెంబ్లీలో 2022-23 బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. రూ. 2.56 కోట్లతో ఆయన బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.

తెలంగాణ బ‌డ్జెట్ 2022-23 కేటాయింపులు ఇలా..

రెవెన్యూ వ్యయం రూ.1,89,274.82 కోట్లు

మూలధన వ్యయం రూ.29,728.44 కోట్లు

రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

రూ.2,56,958.51 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

దళితబంధు రూ.17,700 కోట్లు

పల్లె ప్రగతి ప్రణాళిక రూ.330 కోట్లు

వైద్య కళాశాలలు రూ.1000 కోట్లు

ఎస్టీ సంక్షేమం రూ.12,565 కోట్లు

బీసీ సంక్షేమం రూ.5,698 కోట్లు

బ్రాహ్మణ సంక్షేమం రూ.177 కోట్లు

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ రూ.2,750 కోట్లు

ఆసరా పెన్షన్లు రూ.11,728 కోట్లు

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు రూ.12,000 కోట్లు

పట్టణ ప్రగతి రూ.13,094 కోట్లు

మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగులో వైద్య కళాశాలలు

మార్చిలోపు రూ.50వేలలోపు రుణాల మాఫీ

వచ్చే ఏడాదికల్లా రూ.75వేలలోపు రుణాలు మాఫీ

సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం

రాష్ట్రంలో రూ.2.5 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు లక్ష్యం

పామాయిల్‌ సాగు ప్రోత్సాహకాలు రూ.1000 కోట్లు

వ్యవసాయం రూ.24,254 కోట్లు

హరిత హారం రూ.932 కోట్లు

అటవీ విశ్వ విద్యాలయం రూ.100 కోట్లు

రాష్ట్రంలో 5.12 లక్షల మంది రైతులకు రుణమాఫీ

పంట రుణాల మాఫీకి రూ.16,144 కోట్లు

దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి

సొంత స్థలంలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల సాయం

నియోజకవర్గానికి 3వేల ఇళ్లు.. 4 లక్షల మందికి లబ్ధి

ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్లు

సీఎం పరిధిలో నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43వేల ఇళ్లు

రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు

ఈ ఏడాది కొత్తగా 8 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు

హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాల ఏర్పాటు

హెచ్‌ఎండీఏ పరిధిలో 94 బస్తీ దవాఖానాలు ఏర్పాటు

రాబోయే రోజుల్లో మరిన్ని డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు

రోగులకు ఇచ్చే డైట్‌ ఛార్జీలు రూ.112కు పెంపు

33 జిల్లాల్లో ప్రత్యేకంగా బాల రక్షక వాహనాలు ఏర్పాటు

విద్యుత్‌ సబ్సిడీలకు రూ.10,500 కోట్లు

కేసీఆర్‌ కిట్‌ రూ.463 కోట్లు

స్కాలర్‌షిప్‌లు, పౌష్టికాహారం రూ.4,688 కోట్లు

ఆర్టీసీ రూ.1500 కోట్లు

ఆరోగ్యశ్రీ రూ.1343 కోట్లు

ఆర్‌ అండ్‌బీ రూ.8,327 కోట్లు

పరిశ్రమల ప్రోత్సాహకాలు రూ.2,519 కోట్లు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రూ.1,500 కోట్లు

పావలా వడ్డీ స్కీమ్‌కు రూ.187 కోట్లు

ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రూ.500 కోట్లు

కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ రూ.750 కోట్లు

గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో పంచాయతీ భవనాలకు రూ.600 కోట్లు

ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1000 కోట్లు

రైతుబంధు తరహాలోనే నేత కార్మికుల కోసం ప్రత్యేక పథకం

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం

మొదటి విడతలో లక్ష మంది కార్మికులకు మోటార్‌ సైకిళ్ల పంపిణీ

హైదరాబాద్ పరిధిలోని ఆలయాల్లో దూప దీప నైవేద్యాలకు రూ.12.5 కోట్లు

హైదరాబాద్‌, ఓఆర్‌ఆర్‌ చుట్టూ నీటి కొరత తీర్చేందుకు రూ1200 కోట్లు

Similar News