TG: మంత్రివర్గ విస్తరణకు మోక్షమెన్నడో..?

ఇప్పటికే పలుమార్లు వాయిదాపడ్డ విస్తరణ...పోటీ ఎక్కువగా ఉండడమే కారణమన్న చర్చ;

Update: 2025-04-07 03:30 GMT

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర నేతలు చెప్పిన ప్రకారం ఏప్రిల్ 3న మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అందరూ భావించారు. అంతేకాక మంత్రి పదవి తమకే వస్తుందని పలువురు నేతలు తమ వర్గీయుల వద్ద చెపుకున్నారు. మరికొందరు అయితే నాకు పలానే శాఖ ఇస్తున్నారని కూడా చెప్పుకున్నారు. మొత్తం ఖాళీగా ఉన్న 6 పోస్టుల్లో నాలుగింటికి ఈ దఫా భర్తీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ అనుకున్న తేదీకి తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ మాత్రం జరగలేదు. ఈ వాయిదాకు కారణం ఇవే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.

పోటీనే కారణమా?

తెలంగాణ కేబినెట్ లో బెర్తు కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణలో పదవులు దక్కకుంటే అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశముందని ఢిల్లీ పెద్దలు భావించినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ సీటు దక్కనందుకు కొందరు నేతలు రెబల్ గా పోటీ చేసి..పార్టీ కొన్ని సీట్లు తగ్గేందుకు కారణమయ్యారని కాంగ్రెస్ పెద్దలు అభిప్రాయ పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ఇక మంత్రి వర్గ విస్తరణ ప్రస్తావన రాదని పలువురు చెబుతున్నారు.

అధిష్టానాన్ని భయపెడుతున్న అంశాలు ఇవే:

కాంగ్రెస్ అధిష్టానం మంత్రి వర్గ విస్తరణ చేస్తే .. ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి ఊహించి కాస్తా భయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా జెండాను పట్టుకున్న నేతలకు కాకుండా పార్టీలు మారి వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని..పేర్లు ఖరారు కాకముందే కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ST, SC సామాజికవర్గం నేతలు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ లేఖ రాశారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం అధిష్టానంకు లేఖలు రాయడం కాస్తా ఇబ్బందిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News