సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.4గంటలకు జరిగే క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. వారికి 2 DAలు ఇవ్వడంపై ప్రకటన చేసే ఛాన్సుంది. దీంతో పాటు రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం తెలపడం, గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపు, ఇందిరమ్మ కమిటీలు, కులగణన, SC వర్గీకరణ, అసెంబ్లీ సమావేశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళలను సీరియస్ గా తీసుకుంది. పరివాహన ప్రాంతంలో ఉన్న నిర్వాసితులకు ఇళ్లను కేటాయించే పనిలో పడింది. ఇప్పటికే చాలా ఇళ్లకు మార్కింగ్ కూడా చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా మూసీ సుందరీకరణను తీసుకుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో ఈ విషయంపై లోతుగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవలనే మంత్రుల బృందం సియోల్ లో పర్యటించింది. దక్షిణ కొరియాలోని నదుల అభివృద్ధిని అధ్యయనం చేసింది. ఈ నివేదికలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.