ఎంసీహెచ్‌ఆర్‌డీ (MCHRD) ఆవరణలో గెస్ట్ హౌజ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.7 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ జనరల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శశాంక్ గోయెల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేశారు. నూతనంగా నిర్మించనున్న ఈ గెస్ట్ హౌజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించనున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం సీఎం తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. నిత్యం తన కోసం వచ్చే సందర్శకులను కలిసేందుకు, ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి క్యాంప్ ఆఫీస్ లేదు. అందుకే ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్మించనున్న గెస్ట్ హౌజ్‌ను సీఎం క్యాంప్ ఆఫీస్‌గా వినియోగిస్తారని సమాచారం.