ఏపీ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్
కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శరైతు ఉప్పల ప్రసాదరావుకు నిన్న ఉదయం ఒక ఫోన్ వచ్చింది. ఆ కాల్ సీఎం కేసీఆర్ నుంచి నేరుగా వచ్చింది;
ఏపీ రైతుకు ఫోన్ చేసి ఆశ్చర్యపరిచారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీంతో ఆ రైతు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.. కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శరైతు ఉప్పల ప్రసాదరావుకు నిన్న ఉదయం ఒక ఫోన్ వచ్చింది. ఆ కాల్ సీఎం కేసీఆర్ నుంచి నేరుగా వచ్చింది అని తెలియడంతో రైతు కాసేపు నమ్మలేకపోయినా.. తరువాత నిర్ధారించుకుని ఉబ్బితబ్బిబ్బయ్యారు..
సీడ్రిల్ ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై రైతు ప్రసాదరావును సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాను 35 ఎకరాల్లో సీడ్రిల్‌ను ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేశానని.. 40-45 బస్తాలు దిగుబడి సాధించానని ప్రసాదరావు తెలిపారు. త్వరలో కారు పంపిస్తానని, తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు పరిశీలించాలని, ఒకపూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ప్రసాదరావుకు కేసీఆర్ ఆహ్వానం పలికారు. కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ప్రసాదరావును పలువురు రైతులు అభినందించారు.