KCR : జార్ఖండ్ పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
KCR : దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. జార్ఖండ్‌లో పర్యటిస్తున్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.;
KCR : దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. జార్ఖండ్‌లో పర్యటిస్తున్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కొత్త పంథాలో నడిపించేందుకు.. అడుగు ముందుకు పడిందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో పనిచేయడం లేదన్నారు. త్వరలో అందరినీ కలిసి దేశాభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక కావాలో చర్చిస్తామన్నారు. ఎవరికి అనుకూలం.. ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. దేశాభివృద్ధే ముఖ్యమన్నారు. తెలంగాణ ఉద్యమానికి శిబు సోరెన్ ఎన్నోసార్లు మద్దతు ఇచ్చారన్నారు. ఉద్యమ సమయం నుంచి శిబు సోరెన్‌తో మంచి అనుబంధం ఉందన్నారు.