జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రట‌రీల‌కు సీఎం కేసీఆర్ శుభవార్త..!

రాష్ట్రంలోని జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రట‌రీల‌కు శుభవార్తను చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్..;

Update: 2021-03-26 09:11 GMT

రాష్ట్రంలోని జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రట‌రీల‌కు శుభవార్తను చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్..అంద‌రూ పంచాయ‌తీ సెక్రట‌రీల మాదిరిగానే.. జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రట‌రీల‌కు ఈ ఏప్రిల్ నుంచే రెగ్యుల‌ర్ పీఎస్‌ల‌కు ఇచ్చిన జీతాలు ఇస్తామని వెల్లడించారు. క‌డుపులు నింపినోళ్లం.. క‌డుపు కొట్టినోళ్లం కాదని అన్నారు. కానీ ప్రొబేష‌న‌రీ పీరియ‌డ్‌ను మ‌రో ఏడాది పెంచుతామని అన్నారు. కార్యదర్శుల పైన ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. హరితాహారం మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని హెచ్చరించారు. 

Tags:    

Similar News