CM KCR Health : నిలకడగానే సీఎం కేసీఆర్ ఆరోగ్యం : ఎం.వి.రావు

CM KCR Health : సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలపై వివరణ ఇచ్చారు ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు.;

Update: 2022-03-11 07:27 GMT

CM KCR Health : సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలపై వివరణ ఇచ్చారు ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు. సీఎం కేసీఆర్‌కు ఏటా ఫిబ్రవరిలో రెగ్యూలర్ చెకప్‌ చేస్తామన్నారు. రెండు రోజుల నుంచి వీక్‌గా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం నార్మల్ పరీక్షలు చేశామన్నారు. కేసీఆర్‌కు గుండె యాంజియోగ్రామ్‌, సిటీ స్కాన్‌ టెస్టులు చేశామన్నారు. యాంజియోగ్రామ్‌లో నార్మల్‌ వచ్చిందన్నారు.

ఎలాంటి బ్లాక్స్‌ లేవని చెప్పారు. రిపోర్టులను బట్టి తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ యశోధ హాస్పిటల్‌కు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వైద్యులను సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

మరోవైపు యశోధ హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు. అస్వస్థత కారణంగా అంతకుముందు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయిందని సీఎంవో ప్రకటించింది.

Tags:    

Similar News