మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఒక్కరోజు సెలవును ప్రకటించారు.;
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఒక్కరోజు సెలవును ప్రకటించారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్రగా ఆయన అభివర్ణించారు. పురుషులతోపాటు నేడు అన్ని రంగాల్లో పోటీ పడుతూ మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారన్నారు.
జనాభాలో సగంగా ఉన్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారన్నారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ వివరించారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ సహా అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ మహిళా సంక్షేమంలో ముందంజలో ఉందన్నారు సీఎం కేసీఆర్.