KCR : సీఎం కేసీఆర్‌కు గిరిజన మహిళ చిమ్నీబాయి కృతజ్ఞతలు
KCR : ప్రజా సమస్యలపై సత్వర స్పందన కనబర్చిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు గిరిజన మహిళ చిమ్నీబాయి.;
KCR : ప్రజా సమస్యలపై సత్వర స్పందన కనబర్చిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు గిరిజన మహిళ చిమ్నీబాయి. సీఎం కేసీఆర్ నారాయణ్ ఖేడ్ పర్యటన సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. గతంలో తనకు గ్రామ సమస్యలు చెప్పిన చిమ్నీబాయి పేరును ప్రస్తావించారు. దీంతో కేసీఆర్ వెంటనే స్పందించి.. సభలో ఉన్న చిమ్నీబాయిని స్టేజీ మీదకు పిలిపించారు. కేసీఆర్ పిలుపు మేరకు స్టేజీ మీదకు వెళ్లిన చిమ్నీబాయి.. తమ తండా సమస్యలను వివరించారు. కేసీఆర్ అలా తనను పిలిచి మాట్లాడడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చిమ్నీబాయి తెలిపారు.