అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు.. సిఎం రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణలో నాలుగు లక్షల మందికి మెరుగైన వైద్యం అందించేందుకు డిజిటల్ హెల్త్‌కార్డులు;
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి క్రమేపీ పాలనను ఒక పద్ధతిలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో నాలుగు లక్షల మందికి మెరుగైన వైద్యం అందించేందుకు డిజిటల్ హెల్త్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు. దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త డిజిటల్ కార్డుల కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 'డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్‌కేర్' అనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ... ‘‘అత్యుత్తమ వైద్య, సాఫ్ట్‌వేర్ సేవలకు హైదరాబాద్ నగరం రాజధాని. కానీ... నాణ్యమైన వైద్యసేవలు పొందాలంటే చాలా ఖర్చు అవుతుంది. ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు అందించడమే నా లక్ష్యం. వరకు ఉచితంగా వైద్యసేవలు అందజేస్తాం. తమ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు రూ.10 లక్షలు.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని.. డిజిటల్ హెల్త్ కార్డులు భద్రత, డేటా ప్రైవసీకి 33 శాతం రక్షణ కల్పిస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ప్రపంచంలోని వ్యాక్సిన్‌లు, మందులు హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయి.
అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు.. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ప్రకటన
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.37,870 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోనే ఉన్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ పెట్టుబడులన్నీ నిన్ననే వచ్చాయి.