Telangana : తెలంగాణ డీజీపీకి మాతృ వియోగం...

Update: 2025-08-15 13:15 GMT

తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న డీజీపీ జితేందర్ తల్లి కృష్ణ గోయల్ (85) కన్ను మూశారు. ఇటీవలే ఆమెను చికిత్స కోసం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గా తెలుస్తోంది. డీజీపీ తల్లి మృతి పట్ల పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News