Heavy Rain Altert : తెలంగాణకు మరోసారి భారీ వర్షాల ముప్పు: వాతావరణ శాఖ అలెర్ట్...

Update: 2025-09-24 05:10 GMT

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది. దీనితో పాటు తెలంగాణ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి కూడా విస్తరించి ఉండడంతో..వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని... ఇది 26న వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరింత ఉధృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News