ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందజేయనున్నారు. ఈ సీజన్‌లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాంతో 20 వేల కోట్లతో ధాన్యం సేకరిస్తోంది. ప్రతి సంవత్సరం 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకురానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.