ప్రజలు విసిరే సవాళ్లను మాత్రమే స్వీకరిస్తాం : వినయ్ భాస్కర్
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీకి సవాళ్లు, గుళ్లు గోపురాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.;
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీకి సవాళ్లు, గుళ్లు గోపురాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారాయన. ప్రజలు విసిరే సవాళ్లను మాత్రమే స్వీకరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వరంగల్ నగరాన్ని రూ. 11 వందల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఇది నిరూపించడానికి దేనికైనా సిద్ధమన్నారు వినయ్ భాస్కర్.