Telangana Government : హరిహర వీరమల్లు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రీమియర్ షోలకు మరియు సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. సినిమా విడుదల తేదీ (జూలై 24) కంటే ఒక రోజు ముందు, అంటే జూలై 23న రాత్రి 9:30 గంటలకు 'హరిహర వీరమల్లు' ప్రీమియర్ షో పడనుంది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 + జీఎస్టీ (సుమారు రూ.708)గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్ లలో రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 24 నుంచి జూలై 27 వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 'హరిహర వీరమల్లు' టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.