Telangana government : ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులందరూ పాస్ : తెలంగాణ ప్రభుత్వం
Telangana government : ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.;
Telangana government : ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన వారందరినీ పాస్ చేస్తున్నట్టుగా విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఫస్టియర్ విద్యార్థులను మినిమం మార్కులు ఇచ్చి పాస్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 2.50 లక్షల మంది విద్యార్థులకు ఊరట కలిగించింది. అయితే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల ఫలితాల్లో కేవలం 49 శాతం మంది విద్యార్దులు మాత్రమే పాస్ అయ్యారు.