TG:గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ నజర్

మధ్యాహ్నం 12 గంటలకు గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం

Update: 2026-03-13 04:00 GMT

పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన గ్యాస్ కొరతపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ శాంతి కుమారి నేడు మధ్యాహ్నం 12 గంటలకు గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా హోటళ్లు, హాస్టళ్లపై ప్రభావం చూపుతున్న కమర్షియల్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెటింగ్ నివారణపై ఈ భేటీలో చర్చించనున్నారు. గృహ అవసరాలకు సరఫరా సజావుగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

హాస్టళ్లలో కొనసాగుతున్న కష్టాలు 

గ్యా­స్‌ కొరత దృ­ష్ట్యా కొ­న్ని స్టా­ర్‌ హో­ట­ళ్ల మె­నూ­లో మా­ర్పు­లు చే­శా­రు. ఇం­ధ­నం ఎక్కు­వ­గా అవ­స­ర­మ­య్యే గ్రి­ల్డ్‌ చి­కె­న్, మటన్, కబా­బ్‌­ల­ను మె­నూ­లో తొ­ల­గిం­చా­రు. బం­జా­రా­హి­ల్స్‌­లో­ని ఓ స్టా­ర్‌ హో­ట­ల్‌ రో­జు­కు 50 సి­లిం­డ­ర్ల­ను వా­డు­తుం­డ­గా.. సర­ఫ­రా ఉం­డ­బో­ద­న్న అం­చ­నా­తో భో­జ­నం తి­నేం­దు­కు మా­త్ర­మే వస్తు­న్న­వా­రి­కి కొ­న్ని ఆహార పదా­ర్థా­లు ఉన్నా­య­ని చె­బు­తు­న్నా­రు. హై­ద­రా­బా­ద్‌ లక్డీ­కా­పూ­ల్‌­లో­ని షా­గౌ­స్‌ హో­ట­ల్‌­లో బు­ధ­వా­రం మధ్యా­హ్నం కట్టెల పొ­య్యి­పై­నే బి­ర్యా­నీ చే­సి­న­ట్లు యజ­మా­ని రబ్బా­నీ తె­లి­పా­రు. గ్రే­ట­ర్‌ పరి­ధి­లో­ని ప్యా­ర­డై­జ్‌ హో­ట­ళ్ల­లో అవ­స­ర­మైన చో­ట్ల వి­ద్యు­త్‌­పై వం­ట­లు వం­డు­తు­న్నా­మ­ని నిర్వాహకులు తెలిపారు.

ఎక్కువ సం­ఖ్య­లో ఐటీ ఉద్యో­గు­లు వసతి పొం­దు­తు­న్న ప్రై­వే­టు పీజీ హా­స్ట­ళ్ల­కు వా­ణి­జ్య గ్యా­స్‌ సి­లిం­డ­ర్ల సర­ఫ­రా­ను వెం­ట­నే ప్రా­రం­భిం­చా­ల­ని తె­లం­గాణ రా­ష్ట్ర ఐటీ కా­రి­డా­ర్‌ హా­స్ట­ల్‌ అసో­సి­యే­ష­న్‌ కో­రిం­ది. రా­య­దు­ర్గం­లో బు­ధ­వా­రం ని­ర్వ­హిం­చిన వి­లే­క­ర్ల సమా­వే­శం­లో అసో­సి­యే­ష­న్‌ అధ్య­క్షు­డు అమ­ర్‌­నా­థ్‌­రె­డ్డి, ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి కరు­ణా­క­ర్, కో­శా­ధి­కా­రి మహీ­ధ­ర్‌ తది­త­రు­లు మా­ట్లా­డా­రు. వా­ణి­జ్య సి­లిం­డ­ర్ల సర­ఫ­రా ని­లి­పి­వే­య­డం­తో హై­ద­రా­బా­ద్‌­లో­ని 11 వేల హా­స్ట­ళ్ల­లో వసతి పొం­దు­తు­న్న 10 లక్షల మంది ఇబ్బం­దు­లు పడు­తు­న్నా­ర­న్నా­రు. సా­మ­ర్థ్యా­న్ని బట్టి ఒక్కో హా­స్ట­ల్‌­లో 100 నుం­చి 300 మంది వరకు ఉన్నా­ర­ని, తె­లి­పా­రు.

మన వంటింట్లో గ్యాస్ మంటలు

ఇరా­న్, ఇజ్రా­యె­ల్‌, అమె­రి­కా యు­ద్ధం­తో భా­ర­త్‌­లో సం­క్షో­భం మొ­ద­లైం­ది. దే­శ­వ్యా­ప్తం­గా అన్ని రా­ష్ట్రా­ల్లో కమ­ర్షి­య­ల్ గ్యా­స్ కష్టా­లు మరింత పె­రి­గా­యి. కమ­ర్షి­య­ల్‌ గ్యా­స్‌ సర­ఫ­రా­ను పం­పి­ణీ సం­స్థ­లు ని­లి­పి­వే­య­డం­తో పలు రా­ష్ట్రా­ల్లో గ్యా­స్‌ కష్టా­లు మొ­ద­ల­య్యా­యి. ఖతా­ర్​ నుం­చి సర­ఫ­రా ని­లి­చి­పో­వ­డం­తో చాలా రం­గా­లు ఇబ్బం­ది పడు­తు­న్నా­యి. జేఎం ఫై­నా­న్షి­య­ల్ తాజా రి­పో­ర్టు ప్ర­కా­రం.. ఒప్పం­దాల ప్ర­కా­రం సర­ఫ­రా చే­య­లేక కొ­న్ని కం­పె­నీ­లు ఫో­ర్స్ మె­జూ­ర్ నో­టీ­సు­లు జారీ చే­శా­యి. అంటే సర­ఫ­రా చే­య­లే­మ­ని చే­తు­లె­త్తే­శా­యి. పా­రి­శ్రా­మిక వి­ని­యో­గ­దా­రు­ల­కు సప్ల­య్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌‌ 10–50 శాతం వరకు తగ్గిం­ది. హై­ద­రా­బా­ద్‌­లో గ్యా­స్‌ కొ­ర­త­తో హా­స్ట­ల్స్‌ మూ­త­ప­డు­తు­న్నా­యి.-- తి­రు­ప­తి­లో కమ­ర్షి­య­ల్ గ్యా­స్‌ కొరత మూ­లం­గా భక్తుల ఇబ్బం­దు­లు పడు­తు­న్నా­రు. కే­ర­ళ­లో రేపో ఎల్లుం­డో 50% హో­ట­ళ్లు మూ­త­ప­డే ప్ర­మా­దం ఉం­ద­ని ఆం­దో­ళన వ్య­క్త­మ­వు­తుం­ది. ఇప్ప­టి­కే ముం­బై­లో 10వేల రె­స్టా­రెం­ట్లు మూ­త­ప­డ­టం­తో 4లక్షల మంది రో­డ్డున పడే పరి­స్థి­తి నె­ల­కొం­ది. ఢి­ల్లీ­లో గ్యా­స్ ఏజె­న్సీల ముం­దు రీ­ఫి­ల్లిం­గ్ కోసం భారీ ఎత్తున క్యూ లై­న్ల­లో వేచి చూ­స్తు­న్నా­రు. బెం­గ­ళూ­రు హో­ట­ళ్ల మె­నూ­లో వం­ట­కా­లు తగ్గిం­చా­రు. తమి­ళ­నా­డు రె­స్టా­రెం­ట్ల­లో ఎల­క్ట్రి­క్ ఓవె­న్లు వి­ని­యో­గి­స్తు­న్నా­రు. గు­జ­రా­త్‌­లో పలు తి­ను­బం­డా­రాల దు­కా­ణా­లు మూ­త­ప­డ్డా­యి.

Tags:    

Similar News