తెలంగాణలో గ్రూప్-2 ‘కీ’ని రేపు(జనవరి 10) విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవని అన్నారు. భవిష్యత్తులో పెండింగ్ అనేది ఉండదని స్పష్టం చేశారు. టీజీపీఎస్సీలో సైంటిఫిక్ డిజైన్ లోపించిందని, అందుకే పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు చెప్పారు. కాగా నిన్న గ్రూప్-3 ‘కీ’ని టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇక డిసెంబర్ 15, 16వ తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలు నిర్వహించారు. 2 రోజుల పాటు నాలుగు సెషన్లలో గ్రూప్–2 పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అనంతరం డిసెంబర్ 15,16 తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది. 2023 జులైలో TPBO ఉద్యోగాలకు రాత పరీక్ష జరగ్గా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించింది.