TS High court : తెలంగాణ ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!
TS High court : తెలంగాణ ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్ పరీక్షలు ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.;
ts high court
TS High court : తెలంగాణ ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్ పరీక్షలు ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... ఇంటర్ బోర్డ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 25 నుంచి పరీక్షలు నిర్వహించడానికి ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే పరీక్ష నిర్వహణను వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషల్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని, పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైనందని పేర్కొంది.