విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీఆర్‌ఎస్ పూర్తి వ్యతిరేకం : కేటీఆర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. అవసరమైతే కేసీఆర్ మద్దతుతో విశాఖకు వచ్చి ప్రత్యక్ష మద్దతు తెలిపేందుకు కూడా సిద్ధమన్నారు.;
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. అవసరమైతే కేసీఆర్ మద్దతుతో విశాఖకు వచ్చి ప్రత్యక్ష మద్దతు తెలిపేందుకు కూడా సిద్ధమన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇలాగే చూస్తూ కూర్చుంటే రేప్పొద్దున బీహెచ్‌ఈఎల్, సింగరేణిని అమ్ముతామంటూ కేంద్రం ముందుకొచ్చినా రావొచ్చని అన్నారు.