KTR : ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేశారు : కేటీఆర్
KTR : కేంద్రానిది అంతులేని వైఫల్యాల చరిత్ర అంటూ నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్రపై ఆయన ప్లీనరీలో తీర్మానం ప్రవేశ పెట్టారు.;
KTR : కేంద్రానిది అంతులేని వైఫల్యాల చరిత్ర అంటూ నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్రపై ఆయన ప్లీనరీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. నాడు ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేస్తే.. నేడు కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా క్రియేట్ చేశారన్నారు.
ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారని.. కానీ మన వద్ద రాష్ట్రాన్ని సాధించిన నేత సీఎంగా ఉన్నారన్నారు. కేసీఆర్ జన్మధన్యమైందని ప్రణబ్ ముఖర్జీనే చెప్పారన్నారు. మన పథకాలన్నీ కేంద్రం కాపీ కొడుతుందని.. ప్రధాని మోదీ రైతు విరోధి అంటూ విమర్శించారు.
నల్లధనం అంటే మోదీ తెల్లముఖం వేశారన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మండిపడ్డారు. ధరలన్నీ పెంచేశారని.. మతపిచ్చి లేపి రాజకీయం చేస్తున్నారని భగ్గుమన్నారు కేటీఆర్.