ఎరువుల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యం: మంత్రి నిరంజన్‌రెడ్డి
ఎరువుల సబ్సిడీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు అమాయకంగా, హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు;
ఎరువుల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యమని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎరువుల సబ్సిడీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు అమాయకంగా, హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఈ సబ్సిడీ కేంద్రం ప్రత్యేకంగా భరించదని, రాష్ట్రాల ఆదాయం మీదే కేంద్రం మనుగడ సాగిస్తోందని అన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన విఫల పథకమని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ ఫసల్ బీమా పథకం అమలు చేయట్లేదన్నారు. దీనికి తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.