TS: బడ్జెట్‌పై భగ్గమన్న తెలంగాణ మంత్రులు
తీరని ద్రోహం చేశారన్న మంత్రులు... తెలంగాణను పట్టించుకోలేదని ఆవేదన;
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ మంత్రులు భగ్గుమన్నారు. కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష చూపిందని, బిహార్‌కు అధికంగా నిధులిచ్చి.. రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భట్టి బడ్జెట్‌పై తమ స్పందనను ఒక ప్రకటనలో వివరించారు. బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణపై పూర్తిగా నిర్లక్ష్యం చూపిందని.... రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించేలా వ్యవహరించిందిని మంత్రులు భగ్గుమన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర బడ్జెట్ విఫలమైందని భట్టి విక్రమార్క విమర్శించారు. సెస్‌లను పెంచడం ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయపు వాటాను మరింత తగ్గించిందన్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో బిహార్ రాష్ట్రానికి వివిధ పథకాల ద్వారా అధిక నిధులు కేటాయించారని... వ్యవసాయాభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడే కేంద్రం.. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వలేదని మండిపడ్డారు. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి నిధులిస్తే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేదన్నారు.
ఇది తెలంగాణ వ్యతిరేక బడ్జెట్: ఉత్తమ్
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి ద్రోహం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలుగు కవి గురజాడ అప్పారావు వ్యాఖ్యలతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలుగు రాష్ట్రమైన తెలంగాణను మాత్రం పట్టించుకోలేదన్నారు. దేశ జీడీపీలో 4.5 శాతం వాటా ఉన్న రాష్ట్రానికి మొండిచేయి చూపారన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై శీతకన్ను వేసిందన్నారు. గత బడ్జెట్‌ను మేం కుర్సీ బచావో బడ్జెట్ అని పిలిచాం. ఈసారి చునావ్.. జీతావ్ బడ్జెట్ అని పిలుస్తున్నామన్నారు.
ఇంత ద్రోహమా : శ్రీధర్‌బాబు
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ మంత్రులు భగ్గుమన్నారు. కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష చూపిందని, బిహార్‌కు అధికంగా నిధులిచ్చి.. రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భట్టి బడ్జెట్‌పై తమ స్పందనను ఒక ప్రకటనలో వివరించారు. బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణపై పూర్తిగా నిర్లక్ష్యం చూపిందని.... రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించేలా వ్యవహరించిందిని మంత్రులు భగ్గుమన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర బడ్జెట్ విఫలమైందని భట్టి విక్రమార్క విమర్శించారు. సెస్‌లను పెంచడం ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయపు వాటాను మరింత తగ్గించిందన్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో బిహార్ రాష్ట్రానికి వివిధ పథకాల ద్వారా అధిక నిధులు కేటాయించారని... వ్యవసాయాభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడే కేంద్రం.. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వలేదని మండిపడ్డారు. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి నిధులిస్తే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేదన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: నరేందర్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ బడ్జెట్లో ప్రత్యేక నిధులు ఏమీ లేవని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివాసీలకు తీరని అన్యాయం
కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మీడియాతో అన్నారు. వికసిత భారత్ అంటూ ఊదరగొట్టిన బిజెపి ప్రభుత్వం గిరిజనులను మరింత పేదరికంలో నెట్టేలా చూస్తుందన్నారు.